Work for the development of the district జిల్లా అభివృద్ధికి కృషి చేయండి
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:25 AM
Work for the development of the district అధికారులంతా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు సూచించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అన్నారు. చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేయండి
ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి
సహజ ప్రసవాలు జరిగేలా చూడాలి
రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు
విజయనగరం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అధికారులంతా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు సూచించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అన్నారు. చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ ఽశాఖల అధికారులతో సమీక్షించారు. చైర్మన్ మాట్లాడుతూ మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించి మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి డీఆర్‌డీఏ రూపొందించిన ప్రణాళికను అభినందించారు. ఈ ప్రణాళిక రాష్ట్రమంతా అమలు చేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు. జిల్లాలో అక్షరాస్యత తక్కువ ఉందని, దీనిని పెంచేందుకు కృషి చేయాలన్నారు. వరి ఉత్పాదకత పెంచాలని, సబ్సిడీపై రెయిన్‌గన్‌లను అందజేసేందుకు ప్రతిపాదన చేయాలని సూచించారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని, సిజేరియన్లను తగ్గించాలని చెప్పారు. ఉపాధి పథకం నిధులతో పాఠశాలల ప్రహారీలు, లింకు రోడ్డ్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని చైర్మన్ ఆదేశించారు. నిఽధులు పూర్తిగా వినియోగించుకోవాలని, మురిగిపోకుండా చూడాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల భవనాలు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. చాలా చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు శిథిలావస్థలోనూ, ఆద్దె భవనాల్లోనూ ఉన్నాయని, సమీపంలో ఉన్న ఖాళీగా ఉండే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సూచించారు. కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా పాఠశాలల ప్రహరీలు నిర్మించాలని సూచించారు ఎమ్మెల్సీ డాక్టర్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కు ఆరోగ్య పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను జేసీ సేతు మాధవన్ చైర్మన్‌కు వివరించారు. ధాన్యం సేకరణ సమయంలో రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమీక్షలో డీఆర్‌వో శ్రీనివాస్‌మూర్తి, సీపీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పైడిమాంబను దర్శించుకున్న కమిటీ
విజయనగరం రూరల్/కల్చరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు, సభ్యులతో కలిసి గురువారం పైడితల్లి వనంగుడిని దర్శించారు. దేవదాయశాఖ ఏసీ, ఇన్‌చార్జి ఈవో కె.శిరీష, ఆలయ అధికారులు, కమిటీ చైర్మన్, సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు వారికి ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు.