Share News

Elephants కదలవు.. వదలవు!

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:15 PM

Won't Move.. Won't Give Up! సీతంపేట మన్యాన్ని గజరాజులు వీడడం లేదు. నిన్నమొన్నటి వరకు గోరపాడు సమీపంలో సంచరించిన ఏనుగులు ఆదివారం చినబగ్గ అటవీ ప్రాంతంలోని జీడితోటల్లో దర్శనమిచ్చాయి. దీంతో ప్రాంత రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Elephants కదలవు.. వదలవు!
జీడితోటల్లో సంచరిస్తున్న ఏనుగులు

సీతంపేట రూరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యాన్ని గజరాజులు వీడడం లేదు. నిన్నమొన్నటి వరకు గోరపాడు సమీపంలో సంచరించిన ఏనుగులు ఆదివారం చినబగ్గ అటవీ ప్రాంతంలోని జీడితోటల్లో దర్శనమిచ్చాయి. దీంతో ప్రాంత రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారం వల్ల కొండపోడు, పైనాపిల్‌, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లలేకపోతున్నట్లు గోరపాడు, మోహనకాలనీ, చినబగ్గకాలనీకి చెందిన గిరిజనులు వాపోతున్నారు. అవి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక బయటకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. చీకటి పడితే ఆరుబయటకు వెళ్లలేక.. ఇళ్లలోనే బిక్కుబిక్కు ముంటూ ఉండాల్సి వస్తోందన్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. నాలుగు ఏనుగులను రోజూ అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్స్‌ పర్యవేక్షిస్తున్నారని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ఫారెస్ట్‌ బీట్‌ అధికారి దాలినాయుడు తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 11:15 PM