Women’s Upliftment మహిళా అభ్యున్నతే ధ్యేయం
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:16 PM
Women’s Upliftment is the Goal మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరులో ఆమె ఆధ్వర్యంలో స్ర్తీశక్తి పథకం విజయోత్సవ ర్యాలీ జరిగింది.
స్త్రీశక్తితో ఆర్థిక ప్రయోజనం
సాలూరు, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరులో ఆమె ఆధ్వర్యంలో స్ర్తీశక్తి పథకం విజయోత్సవ ర్యాలీ జరిగింది. తొలుత మంత్రి ఇంటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సుమారు ఏడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. మెయిన్ రోడ్డు మీదుగా, బోసు బొమ్మ జంక్షన్, డీలక్స్ సెంటర్ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘స్ర్తీశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఎంతోమంది లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసమే కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శోభారాణి, కౌన్సిలర్ వరలక్ష్మి, కూర్మరాజు పేట సర్పంచ్ నళిని, ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.