Women who have made a move కదంతొక్కిన మహిళలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:47 PM
Women who have made a move మహిళా లోకం కదంతొక్కింది. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలోని మూడులాంతర్లు జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరీ జంక్షన్ వరకూ మహిళలు మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు.

కదంతొక్కిన మహిళలు
సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని నినాదాలు
విజయనగరంలో భారీ ర్యాలీ
విజయనగరం రూరల్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): మహిళా లోకం కదంతొక్కింది. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలోని మూడులాంతర్లు జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరీ జంక్షన్ వరకూ మహిళలు మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాక్షి మీడియాపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు. సాక్షి చానల్ డిబేట్ నిర్వాహకులు, మాట్లాడిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బొద్దల విజయలక్ష్మీ, ఆశాజ్యోతిలు మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో విషం చిమ్మడం, మహిళలను కించపరచడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. తొలుత మూడులాంతర్ల వద్ద ప్రారంభమైన ర్యాలీ గంటస్తంభం మీదుగా కన్యకాపరమేశ్వరీ ఆలయం వరకూ చేరింది. అక్కడ మానవహారం నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వన్‌టౌన్, టూటౌన్, మహిళా, ట్రాఫిక్ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.