Share News

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

ABN , Publish Date - May 20 , 2025 | 12:08 AM

మహిళలు ఆర్థి కంగా నిలదోక్కుకోవాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు, సోమవారం ఎస్‌.కోట శ్రీనివాస కాలనీ సామాజిక భవనంలో ఉచిత టైలరింగ్‌ శిక్షణ తర గతులను ప్రారంభించారు.

 మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
శృంగవరపుకోట: మాట్లాడుతున్న కోళ్ల లలితకుమారి:

శృంగవరపుకోట, మే 19(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థి కంగా నిలదోక్కుకోవాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు, సోమవారం ఎస్‌.కోట శ్రీనివాస కాలనీ సామాజిక భవనంలో ఉచిత టైలరింగ్‌ శిక్షణ తర గతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడ్లుతూ టైలరింగ్‌ శిక్షణ ద్వారా మెలకవలు నేర్చుకొని కుటుంబాల కు ఆర్థికంగా తోట్పాటు ఇవ్వాలని మహిళలకు సూచిం చారు. కార్యక్రమంలో టీడీపీ మండలా ధ్యక్షుడు జీఎస్‌నా యుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, పార్టీ పట్టణాధ్యక్షుడు కొణ దం మల్లేశ్వరరావు, నాయకులు కాపుగంటి వాసు, చక్కా కిరణ్‌, పెదగాడి రాజు, అనకాపల్లి చెల్లయ్య పాల్గొన్నారు.

ఫ లక్కవరపుకోట, మే 19(ఆంధ్రజ్యోతి): మహిళలు కుట్టు మిషన్ల శిక్షణను విని యోగించుకొని స్వశక్తితో బతకాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు. లక్కవరపుకోటలో ప్రభుత్వం మంజూరు చేసిన కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కెర్రు పార్వతి, టీడీపీ నేతలు చొక్కాకుల మల్లునా యుడు, కొల్లు రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 12:08 AM