Share News

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:02 AM

మహిళలు ఆర్థికా భివృద్ధి చెందాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. బుధవారం భోగాపురం మండల పరిషత్‌ కార్యాలయం లో జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యం లో టైలరింగ్‌ శిక్షణపై అవగాహ న కార్యక్రమం నిర్వహించారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే :

భోగాపురం, నవంబరు12 (ఆంఽధ్రజ్యోతి): మహిళలు ఆర్థికా భివృద్ధి చెందాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. బుధవారం భోగాపురం మండల పరిషత్‌ కార్యాలయం లో జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యం లో టైలరింగ్‌ శిక్షణపై అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యకమ్రంలో ఎంపీడీవో డీడీ స్వరూపారాణి, తహసీల్దార్‌ రమణమ్మ, ఈవోపీఆర్డీ గాయిత్రి, నాయ కులు పల్లంట్ల జగదీష్‌, మట్టా అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:02 AM