Share News

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:20 AM

పొదుపు సంఘాల మహి ళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ విప్‌, కురుపాం నియోజ కవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సుంకి ప్రాంతంలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్క్‌ ప్రాంతంలోని ఎనిమిది దుకాణ గదులను ప్రారంభించారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
ఐటీడీఏ పార్కులో దుకాణ సముదాయాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం :

గరుగుబిల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పొదుపు సంఘాల మహి ళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ విప్‌, కురుపాం నియోజ కవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సుంకి ప్రాంతంలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్క్‌ ప్రాంతంలోని ఎనిమిది దుకాణ గదులను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ ఆధ్వ ర్యంలో ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. పార్కు ప్రాంతంలో వ్యాపారాలు చేసు కునేందుకు పలువురిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిత్యం ఇక్కడకు వచ్చే పర్యాటకులకోసం వారికి ఆమోదకరమైన సామగ్రిని అందు బాటులో ఉంచాలని సూచించారు. కార్యక్ర మంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.సుధారాణి, ఎంపీటీసీ సభ్యులు ద్వారపురెడ్డి సత్యనారాయణ, ఎంపీడీవో జి.పైడి తల్లి,ఏపీఎం పి.అప్పలనాయు డుతోపాటు సీసీలు రామినాయుడు, సీహెచ్‌ తిరుపతిరావు, మహిళా సమైఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

పాత్రికేయుల సంక్షేమానికి కృషి

బెలగాం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పాత్రికేయులకు ఏర్పాటు చేసిన కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ అవసరమైన వారికి ఆపరేషన్‌ చేయిస్తామని, కొంతమందికి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, నగేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:20 AM