Share News

మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:13 AM

బుదరాయవలస పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమలింగాపురం గ్రామానికి చెందిన మణిపూర్‌ సరస్వతి(45) అనే మహిళ ఆదివారం చీమలమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మహిళ ఆత్మహత్య

మెరకముడిదాం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): బుదరాయవలస పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమలింగాపురం గ్రామానికి చెందిన మణిపూర్‌ సరస్వతి(45) అనే మహిళ ఆదివారం చీమలమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ జె.లోకేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు సంవత్సరాలుగా సరస్వతి ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఏప్రిల్‌ నెలలో ఆమె భర్త విశాఖపట్టణం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మానసిక స్థితి కూడా బాగోలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో చీమల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన బంధువులు వెంటనే చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.

Updated Date - Sep 29 , 2025 | 12:13 AM