హత్య కేసులో మహిళకు రిమాండ్
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:40 PM
మండలంలోని జట్టేడివలస గ్రామంలో ఈనెల 20న సంచలనం సృష్టించిన నేరపూరితమైన హత్య కేసులో నిందితురాలి గా భావిస్తున్న గూనురు లక్ష్మిని రిమాండ్‌కు పంపినట్టు ఎస్‌ఐ వీర జనార్దన్ తెలిపారు.
జామి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని జట్టేడివలస గ్రామంలో ఈనెల 20న సంచలనం సృష్టించిన నేరపూరితమైన హత్య కేసులో నిందితురాలి గా భావిస్తున్న గూనురు లక్ష్మిని రిమాండ్‌కు పంపినట్టు ఎస్‌ఐ వీర జనార్దన్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కుటుంబ వివాదంలో తన అత్త అయిన కొండమ్మను కిందకు తోసిన లక్ష్మిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. ఈమేరకు న్యాయాధికారి నిందితురాలికి రిమాండ్ విధించారని ఆయన తెలిపారు.