నాగావళి నదిలోకి దూకిన మహిళ
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:12 AM
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని గొట్టమంగళాపురం సమీపంలో నాగావళి నదిపై ఉన్న వంతెనపై నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గుర్తుతెలియని ఓ మహిళ దూకినట్లు సమాచారం మేరకు పోలీసులు అప్రమత్త మయ్యారు.
ఘటనా స్థలంలో ఉమ్మడి జిల్లాల పోలీసులు
పాలకొండ / రేగిడి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని గొట్టమంగళాపురం సమీపంలో నాగావళి నదిపై ఉన్న వంతెనపై నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గుర్తుతెలియని ఓ మహిళ దూకినట్లు సమాచారం మేరకు పోలీసులు అప్రమత్త మయ్యారు. నదీతీరం పార్వతీపురం మన్యం జిల్లాతోపాటు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న రేగిడి ఆమదాలవలసకు అనుసంధానంగా ఉంది. ఈ క్రమంలో ఇరుజిల్లాలకు చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సాయంత్రం సుమారు 35 ఏళ్ల మహిళ వంతెన పైనుంచి నది లోకి దూకింది. అక్కడకు సమీపంలోఉన్న కొందరితోపాటు పాలకొండ వస్తు న్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా ఈ ఘటనను గుర్తించారు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీరు ఉధృతి అధికంగా ఉంది. ఆమె దూకిన క్షణాల వ్యవధిలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు చూసిన వారు పోలీసు లకు సమాచారం అందించారు. దీంతో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పోలీసులు, పాలకొండ అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెతికారు. చీకటిపడడం తో అందరూ వెనుదిరిగారు. నదిలో దూకిన మహిళ వివరాలు తెలియరాలేదు. వంతెన వద్ద చెప్పులు మాత్రమే ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు.