గడువు ముగిసిన ఓఆర్‌ఎస్ తాగి మహిళ అస్వస్థత
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:07 AM
నగరంలోని పాత బస్‌స్టాండ్ వద్దగల సంతోష్ హోల్‌సేల్ దుకాణంలో గడువు ముగిసిన ఓఆర్‌ఎస్ తాగిన రాణి అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.
విజయనగరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): నగరంలోని పాత బస్‌స్టాండ్ వద్దగల సంతోష్ హోల్‌సేల్ దుకాణంలో గడువు ముగిసిన ఓఆర్‌ఎస్ తాగిన రాణి అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. రాణి.. ఈనెల 7వ తేదీన 28 ప్యాకెట్స్ కలిగిన ఓఆర్‌ఎస్ డ్రింక్స్ బాక్సును బల్క్‌లో కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్లింది. అందులో ఒకటి తాగిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి వాంతులు కావ టంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చే సి ఇంటికి పంపించారు. మరుస టి రోజు ఇంటికి వచ్చి ప్యాకెట్లను పరిశీలించగా.. దానిపై గడువు తేదీ ముగిసిన ట్టు ఉంది. వెంటనే ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఫుడ్‌సేఫ్టీ అధికారి నాగుల్‌మీరా శనివారం ఆ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఓఆర్‌ఎస్ డ్రింక్ ప్యాకెట్లు లభించాయి. ఆ డ్రింక్ శాంపిల్స్ సేకరించి దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా నాగుల్‌మీరా మాట్లాడుతూ ప్రజలు ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని కోరారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే 87906 03489 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.