పాముకాటుతో మహిళ మృతి
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:31 AM
మల్లయ్యపేట గ్రామానికి చెందిన మూల అమ్మడు (49) పాముకాటుకు గురై మరణించినట్టు ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు.
సంతకవిటి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మల్లయ్యపేట గ్రామానికి చెందిన మూల అమ్మడు (49) పాముకాటుకు గురై మరణించినట్టు ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం అమ్మడు తన భర్త వెంకటరావుతో కలసి పొలం పనులకు వెళ్లింది. పొలంలో పనులు చేస్తుండగా ఆమెకు పాము కాటు వేసింది. హుటాహుటిన శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమ్మడు గురువారం సాయంత్రం మరణించిట్లు భర్త వెంకటరావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు.