Share News

పాము కాటుతో మహిళ మృతి

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:54 PM

సిరిపురం గ్రామానికి చెందిన గొర్లె దమయంతి(50) పాముకాటుతో శుక్రవారం మృతిచెందింది.

 పాము కాటుతో మహిళ మృతి

సంతకవిటి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సిరిపురం గ్రామానికి చెందిన గొర్లె దమయంతి(50) పాముకాటుతో శుక్రవారం మృతిచెందింది. ఆమె శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లగా, గుర్తు తెలియని పాము ఎడమ కాలుపై కాటు వేసింది. భర్త తారకేశ్వరరావుకు ఫోన్‌ చేయగా, వెంటనే ఆయన వచ్చారు. స్పృహ కోల్పోయి కింద పడిపోయిన ఆమెను పొందూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందింది. ఈమెకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతుదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు.

Updated Date - Oct 11 , 2025 | 11:54 PM