పాము కాటుతో మహిళ మృతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:18 AM
తాటిపూడి ఆవలగల డీకేపర్తి గిరిజన గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొత్తమ్మ (40) పాము కాటుకు గురై మృతి చెందారు.
గంట్యాడ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తాటిపూడి ఆవలగల డీకేపర్తి గిరిజన గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొత్తమ్మ (40) పాము కాటుకు గురై మృతి చెందారు. దీనికి సంబందించి గంట్యాడ ఎస్‌ఐ సాయి కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఇంటిలో ఉన్న కొత్తమ్మను పాము కాటు వేయడంతో అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికృష్ణ తెలిపారు.