Woman Dies Due to Lightning Strike పిడుగుపాటుకు మహిళ మృతి
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:59 PM
Woman Dies Due to Lightning Strike బలిజిపేట మండలం పలగర గ్రామానికి చెందిన వావిలపల్లి చంద్రమ్మ(45) పిడుగుపాటుకు గురై బుధవారం సాయంత్రం మృతి చెందింది. వ్యవసాయ పనులకని వెళ్లిన ఆమె విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీర వుతున్నారు.
బలిజిపేట, జూన్ 4(ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలం పలగర గ్రామానికి చెందిన వావిలపల్లి చంద్రమ్మ(45) పిడుగుపాటుకు గురై బుధవారం సాయంత్రం మృతి చెందింది. వ్యవసాయ పనులకని వెళ్లిన ఆమె విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీర వుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ చంద్రమ్మ, చిన్నంనాయుడు దంపతులు జీవనం సాగిస్తున్నారు. వారికి సంతానం లేదు. కాగా రోజూలానే వారు బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు. చంద్రమ్మ తొటి కూలీలతో కలిసి గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న పొలానికి వెళ్లింది. పెసర మొక్కలు తీసిన అనంతరం సాయంత్రం ఇంటికి తిరుగుపయనమైంది. అయితే ఇంతలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చంద్రమ్మ అకాల మృతిని భర్త చిన్నంనాయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఉదయం తనవెంటే ఉన్న భార్య సాయంత్రం తిరిగి ఇంటికి విగతజీవిగా రావడాన్ని తట్టుకోలేక భోరున విలపించాడు. మరోవైపు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.