విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళ మృతి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:24 AM
జిల్లాలోని ఎస్.కోటకు చెందిన గేదెల ముత్యాలమ్మ అనే మహిళ విశాఖపట్టణంలోని ద్వారక బస్టాండ్ లో గల 25వ ప్లాట్‌ఫాంలో బస్సు ఢీకొని మృతిచెందింది.
విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎస్.కోటకు చెందిన గేదెల ముత్యాలమ్మ అనే మహిళ విశాఖపట్టణంలోని ద్వారక బస్టాండ్ లో గల 25వ ప్లాట్‌ఫాంలో బస్సు ఢీకొని మృతిచెందింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణం వెళ్లే బస్టాప్ వద్ద మధ్యాహ్న సమయంలో ముత్యాలమ్మ బస్సు కోసం వేచిఉంది. బస్సు ఎక్కేందుకు ప్లాట్‌ఫాం సమీపంలోకి వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.