Share News

ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేక.. పనులు సాగక

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:31 PM

సంతకవిటి మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు సక్రమంగా సాగడం లేదు.బడుగు బలహీన వర్గాల వేతనదారులకు వలసలు నివా రించి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన విషయం విదితమే. డిసెంబరు నుంచి జూన్‌ వరకు ప్రతి వేతనదారుడుకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేక.. పనులు సాగక
గోవిందపురంలో పనులుచేస్తున్న వేతనదారులు (ఫైల్‌):

సంతకవిటి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సంతకవిటి మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు సక్రమంగా సాగడం లేదు.బడుగు బలహీన వర్గాల వేతనదారులకు వలసలు నివా రించి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన విషయం విదితమే. డిసెంబరు నుంచి జూన్‌ వరకు ప్రతి వేతనదారుడుకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వేతనదారులకు ఉపాధి కల్పనపై కలెక్టర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయగా మండలంలో తొమ్మిదిపంచాయతీల్లో క్షేత్ర సహా యకులు లేకపోవడంతో ఉపాధి కల్పన కుంటుపడుతోంది. ప్రభుత్వం 50 శాతం మహిళలకు క్షేత్రసహాయకులు కేటా యించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మండలం లోని క్షేత్ర సహాయకులు నియామకంలో తీవ్రజాప్యం జరు గుతోంది. ప్రస్తుతం ఖాళీలు ఉన్న పంచాయతీల్లో మహిళలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంఆదేశాలతో జాప్యం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్షేత్ర సహాయకులు నియామకం జరగక..

మండలంలోని 34పంచాయతీలు ఉండగా తొమ్మిది పంచా యతీల్లో క్షేత్ర సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంతకవిటి క్షేత్రసహాయకుడు మృతిచెందడంతో ఖాళీ అయ్యిం ది. హోంజరాం రిటైర్డ్‌, కాకరాపల్లి క్షేత్ర సహాయకులు ఉద్యో గాలకు రాజీనామాచేశారు. ఈ మూడు పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించేందుకు అవకాశమున్న అధికారు లు చర్యలు తీసుకోలేదు. మంతిన, రామారాయపురం, ఎస్‌.రం గారాయపురం పంచాయతీ క్షేత్ర సహాయకులు విధులకు కొద్ది నెలలుగా గైర్హాజరు కావడంతో జిల్లాఅధికారులు ఆ ముగురిని సస్పండ్‌ చేశారు.అయినా సరే వీరువిధులకు హాజరుకాకపో వడంతో పూర్తి విధులు నుంచి బహిష్కరించారు. వీరి స్థానం లో కొత్త వారిని నియమించడానికి అవకాశమున్నా అఽధికారు లు పట్టించుకున్న దాఖలాలులేవు. గోళ్లవలస, బొద్దూరు, మండవకురిటి పంచాయతీల్లో వివిధ రకాల ఆరోపణలు రావడంతో తాత్కాలికంగా సస్పండ్‌ చేశారు. అవకాశమున్న చోట వెంటనే మహిళలకు క్షేత్ర సహాయకులుగా నియామ కాలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీచేసింది. జనవరి నుంచి రోజుకు 9000 నుంచి 11000 వరకు వేతనదారులకు ఉపాధి కల్పించాలని ఇప్పటికే కలెక్టర్‌ లక్ష్యం విధించారు. క్షేత్ర సహాయకులు నియామకం జరగకపోవడంతో లక్ష్యాన్ని చేరడం కష్టతరమని అధికారులే వాపోతున్నారు.

50 శాతం మహిళలు క్షేత్ర సహాయకులుగా..

క్షేత్ర సహాయకులు 50శాతం కేటాయించాలని కేంద్ర ప్రభు త్వం జీవో విడుదలచేసిన నేపథ్యంలో ఇకపై మండలాల్లో ఖాళీఅయిన పంచాయతీల్లో 50 శాతం మహిళలకు పూర్తయ్యే వరకు వారినే నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సంతకవిటి మండలంలోని 34 పంచాయతీల్లో పరిధిలో 18 మంది పురుషులు, ఏడుగురు మహిళా క్షేత్ర సహాయకులు ఉన్నారు. ఖాళీలు ఉన్న తొమ్మిది పంచాయతీ ల్లో నిబంధనల ప్రకారం మహిళల క్షేత్ర సహాయకుల నియా మకం చేపట్టాలి. క్షేత్ర సహాయకులు ఖాళీలు ఉన్నచోట నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. కమిషనర్‌ ఆదేశాలు జారీచేసి ఐదు నెలలు కావ స్తున్నా అధికారులు నియామకంపై దృష్టి పెట్టలేదని ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాళీల ఉన్న క్షేత్ర సహాయకులు స్ధానంలో కొత్త వారిని నియమించాలని కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:31 PM