ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే..
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:56 PM
డ్యూటీకి వెళ్లొ స్తానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు.
రాజాం రూరల్, జులై 24 (ఆంధ్రజ్యోతి): డ్యూటీకి వెళ్లొ స్తానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన మండల పరిధిలోని పొగిరి గ్రామంలో గురువారం చోటుచే సుకుంది. పొగిరి గ్రామానికి చెందిన శాసపు రమణ(59) అంతకాపల్లి సమీపంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై పొగిరి గ్రామంలోని తన ఇంటి నుంచి బయలుదేరిన రమణ.. పొగిరి జంక్షన్‌లోని పీహెచ్‌సీ సమీపానికి చేరుకునేసరికి ఒక్కసారిగా కళ్లు తిరగడంతో ఉన్నఫలంగా వాహనం పైనుంచి రోడ్డుపై పడిపోయారు. తల కు తీవ్రమైన గాయమైన రమణను అక్కడివారంతా క్షణాల్లో చేతులతో మోసు కుంటూ ఎదురుగా ఉన్న పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి 108 వాహ నంలో రాజాంలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పొగిరి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడి కుమారుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు.