Share News

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:31 AM

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన సంకల్పం నెరవేరింది.

  అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..
అభివృద్ధి జరగనున్న ఉడా కాలనీ గాంధీ పార్కు ఇదే

- నెరవేరిన ‘ఆంధ్రజ్యోతి’ సంకల్పం

-ఉడా కాలనీ గాంధీపార్కుకు మహర్దశ

-అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

-చొరవచూపిన ఎమ్మెల్యే అదితి, కమిషనర్‌ నల్లనయ్య

విజయనగరం టౌన్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన సంకల్పం నెరవేరింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది జనవరి 28న నగరంలోని 43వ వార్డు ఉడా కాలనీలో ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పట్లో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీ గజపతిరాజు, నగర పాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య, వార్డు సభ్యురాలు సత్యవతి హాజరయ్యారు. ఈసందర్భంగా వార్డు ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించారు. ఉడాకాలనీ గాంధీ పార్కుని అభివృద్ధి చేయాలని కోరారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కమిషనర్‌ నల్లనయ్య చొరవచూపారు. ఈ మేరకు పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ మానం వెంకట ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ను ఎమ్మెల్యే అదితి కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రూ.35.85 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో పార్కును అభివృద్ధి చేయన్నారు. ఈ పనులకు శనివారం ఎమ్మెల్యే అదితి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వీఎంఆర్‌డీఏ, నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Aug 02 , 2025 | 12:31 AM