Wind..Rain గాలి..వాన
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:42 PM
Wind..Rain గంగచోళ్లపెంట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులకు బీటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్టు విరిగి విద్యుత్ వైర్లపై పడింది. దీంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు రోడ్డుపై పడడంతో గ్రామస్థులు భయాందో ళన చెందారు.
గాలి..వాన
ఈదురుగాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలు
వర్షంతో పంటలకు ఊరట
గజపతినగరం/వేపాడ/ శృంగవరపుకోట, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): గంగచోళ్లపెంట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులకు బీటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్టు విరిగి విద్యుత్ వైర్లపై పడింది. దీంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు రోడ్డుపై పడడంతో గ్రామస్థులు భయాందో ళన చెందారు. విద్యుత్‌శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని విద్యుత్ శాఖ అధికారి కృష్ణ తెలిపారు.
- వేపాడ మండలంలో శుక్రవారం కురిసిన వర్షం రైతుల్లో ఆనందం నింపింది. గత వారం కురిసిన వర్షానికి భూమిలో పదును చేరడంతో రైతులు దుక్కులు చేపట్టి నువ్వు సాగుకు సిద్ధమయ్యారు. శుక్రవారం కురిసిన వర్షం నువ్వు సాగుకు ఉపకరిస్తుందని రైతులు తెలిపారు.
- శృంగవరపుకోట మండలంలో శుక్రవారం వీచిన ఈదురుగాలులకు కిల్తంపాలెం, బొడ్డవర పంచాయతీల్లో అరటి పంటకు నష్టం జరిగింది. ఎడ్ల సన్యాసిరావుకు చెందిన మూడు ఎకరాల్లో అరటి పంట నేలవాలింది.