collecter serious ఇకనుంచి ఎలా ఉంటానో చూపిస్తా?
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:05 AM
Will you show me how to be from now on? ‘జిల్లా అధికారులు ఏమైనా పెద్ద తోపులా? వేషాలు వేస్తున్నారా? నా అనుమతి లేకుండా కలెక్టరేట్‌లో జిల్లా మంత్రితో సమావేశాలు పెడతారా? మీకు ఎంత దైర్యం? నా పర్మిషన్ లేకుండా జిల్లాలో ఏ ప్రజాప్రతినిధినీ కలవడానికి లేదు.. ఇక నుంచి ఎలా ఉంటానో చూపిస్తా?’ అంటూ కలెక్టర్ అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకనుంచి ఎలా ఉంటానో చూపిస్తా?
జిల్లా అధికారులు ఏమైనా పెద్ద తోపులా?
నా అనుమతి లేకుండా ఏ ప్రజాప్రతినిధినీ కలవడానికి లేదు
నాకు తెలియకుండానే కలెక్టరేట్‌లో సమావేశాలు పెడతారా?
తమాషాలు చేస్తున్నారా.. నాకు బదిలీ అయినా పర్వాలేదు
జిల్లా అధికారులెవరికీ సెలవు ఇచ్చేది లేదు
వ్యక్తిగత కారణాలతో సెలవు పెడితే నా వేధింపుల వల్లేనని ప్రచారం చేస్తారా?
జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ అంబేడ్కర్ ఆగ్రహం
విజయనగరం కలెక్టరేట్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ‘జిల్లా అధికారులు ఏమైనా పెద్ద తోపులా? వేషాలు వేస్తున్నారా? నా అనుమతి లేకుండా కలెక్టరేట్‌లో జిల్లా మంత్రితో సమావేశాలు పెడతారా? మీకు ఎంత దైర్యం? నా పర్మిషన్ లేకుండా జిల్లాలో ఏ ప్రజాప్రతినిధినీ కలవడానికి లేదు.. ఇక నుంచి ఎలా ఉంటానో చూపిస్తా?’ అంటూ కలెక్టర్ అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం పీజీఆర్‌ఎస్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిల్లా అధికారులకు ఇకనుంచి సెలవులు ఇచ్చేది లేదు. ఇద్దరు, ముగ్గురు అధికారులు వ్యక్తిగత కారణాలతో సెలవు పెడితే నేను వేధించడం వల్లేనని జిల్లా మంత్రి, ఇన్‌చార్జి డీఆర్‌వోకు చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాకు ఈ రోజు.. రేపు.. వారం తరువాత.. నెల తరువాత.. ఎప్పుడు బదిలీ అయినా పర్వాలేదు. ఇక నుంచి ఎలా ఉంటానో చూపిస్తాను’ అంటూ కలెక్టర్ ఫైర్ అయ్యారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులెవరూ రాకపోయినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనుంచి రెండుసార్లు అవకాశం ఇస్తామని, మూడోసారి రాకపోతే వారిని సరెండర్ చేస్తానని, అందుకు ఫైల్ పెట్టాలని సీపీవో బాలాజీని ఆదేశించారు. ‘రెండు రోజులు క్రితం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నాకు తెలియకుండా ఉపకరణాలు పంపిణీ చేస్తారా? అలాగే వ్యవసాయ శాఖపై సమీక్ష చేయడానికి సమావేశం పెడతారా? మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుంటరా?’ అంటూ ఆ రెండు శాఖల జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక నుంచి అలా జరిగితే ఊరుకునేది లేదని, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. ఆడిటోరియంలో ఏశాఖ సమావేశాలు పెట్టాలన్నాముందుగా నోట్‌పైల్‌ఫై సంతకం పెట్టిన తరువాత జేసీ లేదా తన అనుమతి తీసుకోవాలన్నారు.
- ‘డీఆర్‌వో తన సోదరికి ఆరోగ్య బాగాలేదని, ఆర్‌డీవో తన కుమారుడుకి ఆరోగ్య సమస్య ఉందని సెలవు పెడితే నేను వేధించడం వల్ల సెలవు పెట్టినట్టు మంత్రి వద్ద ప్రచారం చేస్తారా? ఇక నుంచి ఏ ప్రజాప్రతినిధిని కూడా నా అనుమతి లేకుండా జిల్లా అధికారులు కలవడానికి వీలులేదు. ఎవరైనా పిలిస్తే కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని చెప్పండి’ అని ఆదేశించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే నిందలు వేస్తారా? అని మండి పడ్డారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్‌వో మురళి, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు ఉన్నారు.