Will you settle with the board? బోర్డుతో సరిపెట్టేస్తారా?
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:44 PM
Will you settle with the board? అమటాం రాయవలస పంచాయతీ జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నెంబరు 11/1లో 1.79 ఎకరాల చెరువులో కొంత మేర ఆక్రమణదారులు పూడ్చేశారు.
బోర్డుతో సరిపెట్టేస్తారా?
చెరువులో పూడ్చిన మట్టిని తొలగించేదెవరు?
భోగాపురం, సెప్టెంబరు25(ఆంధ్రజ్యోతి): అమటాం రాయవలస పంచాయతీ జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నెంబరు 11/1లో 1.79 ఎకరాల చెరువులో కొంత మేర ఆక్రమణదారులు పూడ్చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 23న చెరువేదీ?... 24న ఆక్రమణను చూశారు వెళ్లారు శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాలకృష్ణ, ఇన్‌చార్జి వీఆర్వో చిట్టిబాబు వెళ్లి చెరువు స్థలంలో ‘ప్రభుత్వ భూమి... ఆక్రమణ దారులు శిక్షార్హులు’ అంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే పూడ్చేసిన చెరువు ప్రాంతమంతా మెట్టు భూమిలా తయారైంది. పూడ్చిన మట్టిని తొలగించేదెవరు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తిరిగి చెరువు రూపమివ్వాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ ఎం.రమణమ్మను వివరణ కోరగా ఈ విషయమై ఎంపీడీవో, ఇరిగేషన్‌వారికి తెలియపరిచామని, చెరువులో వేసిన మట్టిని తొలగించేలా చర్యలు తీసుకొంటామని చెప్పారు.