Share News

Eligible ఈ సారైనా అర్హులెవరో తేలుస్తారా?

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:59 PM

Will the Eligible Ones Be Finalized This Time? జిల్లాలో దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు బుధవారం పార్వతీపురం, పాలకొండ, సాలూరుతో పాటు విజయ నగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లబ్ధిదారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపారు. వాస్తవంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నాలుగు వైద్య బృందాలు దివ్యాంగ పింఛన్‌దారుల తనిఖీలు చేపట్టాయి. సుమారు 8వేల మంది వైకల్య శాతం, సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాయి.

  Eligible   ఈ సారైనా అర్హులెవరో తేలుస్తారా?

  • 2,884 మందికి నోటీసులు

  • తొలివిడతగా 1863 మందికి ఆసుపత్రుల్లో తనిఖీలు

పార్వతీపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు బుధవారం పార్వతీపురం, పాలకొండ, సాలూరుతో పాటు విజయ నగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లబ్ధిదారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపారు. వాస్తవంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నాలుగు వైద్య బృందాలు దివ్యాంగ పింఛన్‌దారుల తనిఖీలు చేపట్టాయి. సుమారు 8వేల మంది వైకల్య శాతం, సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాయి. అయితే వారిలో 2,884 మందికి పైగా వైకల్య శాతంలో లోపాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. పింఛన్లు నిలుపుదల చేస్తామనడంతో దివ్యాంగ పింఛన్‌దారులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ప్రభుత్వం యథావిధిగా అందరికీ పింఛన్లు పంపిణీ చేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మళ్లీ వారికి సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది ద్వారా నోటీసులిచ్చారు. తొలి విడతగా 1863 మందికి పరీక్షలు నిర్వహించనుండగా.. ప్రస్తుతం ఆసుపత్రుల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో అనర్హులైన దివ్యాంగ పింఛన్‌దారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా వినికిడి లోపం, మానసిక వైకల్యం కలిగిన వారికి విజయనగరంలో, దృష్టిలోపం ఉన్న వారు, ఇతర దివ్యాంగులకు పార్వతీపురం, పాలకొండ, సాలూరు, విజయనగరం ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారైనా అనర్హులను తొలగించి అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారో లేక అందరికీ దివ్యాంగ పింఛన్లు కొనసాగిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఇదీ పరిస్థితి..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తల సూచనలతో అనర్హులకు పెద్దపీట వేశారు. అర్హులైన దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేశారు. వాటిపై పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం దివ్యాంగ పింఛన్ల పరిశీలనకు ఆదేశాలిచ్చింది. కాగా తొలివిడతలోని కొన్ని కేంద్రాల్లో జరిపిన వైద్య పరీక్షలపై విమర్శలొచ్చాయి. అర్హులను కూడా అనర్హులుగా చూపించి గందరగోళ పరిస్థితిని సృష్టించారు. దీంతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లు కూడా రద్దయ్యాయి. దీనిపై కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది అర్హులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం మరోసారి దివ్యాంగుల పింఛన్ల పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో దివ్యాంగ పింఛన్‌దారులకు వైకల్య పరీక్షలు జరుపు తున్నారు. అయితే ఇప్పటికైనా అర్హులైన వారిని గుర్తించి పింఛన్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ సుధారాణిని వివరణ కోరగా.. ‘దివ్యాంగ పింఛన్‌దారులకు ఆసుపత్రుల్లో తనిఖీలు ప్రారంభమయ్యాయి. వారి వైకల్య శాతం బట్టి అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగుతాయి. ’ అని తెలిపారు.

Updated Date - Oct 15 , 2025 | 11:59 PM