డీపీఆర్‌ను ప్రభుత్వానికి నివేదిస్తా: అదితి
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:01 AM
మహారాజా పాలిటెక్నిక్ కళా శాలలో అధునాతన భవనాలను ఏర్పాటు చేసేందుకు డిటెయిల్డ్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ని సిద్ధంచేయాలని, దీన్ని జిల్లా అధికారయంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభు త్వానికి నివేదించనున్నట్లు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
విజయనగరం రూరల్, నవంబరు 4 ( ఆంధ్రజ్యోతి):మహారాజా పాలిటెక్నిక్ కళా శాలలో అధునాతన భవనాలను ఏర్పాటు చేసేందుకు డిటెయిల్డ్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ని సిద్ధంచేయాలని, దీన్ని జిల్లా అధికారయంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభు త్వానికి నివేదించనున్నట్లు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. మంగళవారం విజయనగరంలోని మహారాజా పాలిటెక్నిక్ కళాశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల అభివృద్ధి విషయమై ప్రిన్సిపాల్‌తో పాటు, కళాశాల అధ్యాపకులతో చర్చించారు.
పైడిమాంబ ఆలయం వద్ద అన్నదానం
విజయనగరం రూరల్/ కల్చరల్, నవంబరు 4: విజయనగరంలోని పైడిమాంబ సిరిమాను జాతర అనంతరం మంగళవారం మూడు లాంతర్ల వద్ద గల ్ఠఅమ్మవారి చదురుగుడి వద్ద భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులనా యుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీమణి భక్తులకు అన్నప్రసాదం వడ్డించి ప్రారంభించారు. అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరించేందుకు వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష ఆధ్వర్యంలో ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి భక్తులు, సిబ్బంది, పట్టణ ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీబీ నుంచి భారీ వాహనాలను ఆ రోడ్లలో అనుమతించలేదు. గంటస్తంభం నుంచి చదురుగుడి వైపు వచ్చే వాహనాలను కూడా ఆపేసి, ఆ రోడ్డులో సహపంక్తి భోజనాలు నిర్వహించారు. కొత్తపేట నీళ్లట్యాంకు నుంచి మూడులాంతర్లు వైపు వచ్చే వాహనాలను కూడా వేరే మార్గంలో మళ్లించారు. 10 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశారు.