Share News

Will it be completed by the 18th? 18లోగా పూర్తయ్యేనా?

ABN , Publish Date - May 13 , 2025 | 11:15 PM

Will it be completed by the 18th? జిల్లాలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ నెల 18లోపు రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన కమిటీలకు ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెలాఖరులో కడపలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

Will it be completed by the 18th? 18లోగా పూర్తయ్యేనా?

కసరత్తు ప్రారంభించిన ఎమ్మెల్యేలు

పార్వతీపురం, మే13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ నెల 18లోపు రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన కమిటీలకు ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెలాఖరులో కడపలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో జిల్లాలోని నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే గడువు తక్కువగా ఉండడంతో ఆ లోపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేనా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయాల మేరకు సంస్థాగత ఎన్నికల కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గతంలో పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల సూచించిన వారికే కమిటీల్లో స్థానం కల్పించారు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందనే వాదనలు లేకపోలేదు. విజయమే లక్ష్యంగా చేసుకుని కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి తగ్గట్టుగా కసరత్తు కూడా ప్రారంభమైంది. అయితే ఈ కమిటీల్లో పాత వారికి అవకాశం ఇస్తారా? లేక కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తారా అన్నది! ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - May 13 , 2025 | 11:15 PM