జంఝావతి, తోటపల్లికి నిధులివ్వరూ!
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:22 PM
జిల్లాలోని జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు.
- నీటిపారుదలశాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే విజయచంద్ర
పార్వతీపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. బుధవారం మంత్రి రామానాయుడును ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదని, దీనికోసం రూ.53 కోట్లతో మంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. అదే విధంగా తోటపల్లి ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో టెండర్లను పిలుస్తామన్నారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.