Share News

Araku Parliament అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుని పీఠం ఎవరికో?

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:11 AM

Who Will Get the Araku Parliament TDP President Post? అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుని పీఠం ఎవరికి వరిస్తుందన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది. విశాఖపట్నంలో సోమవారం టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎంపికపై అభిప్రాయ సేకరణ జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఇచ్ఛాపురం, ఏలూరు ఎమ్మెల్యేలు అశోక్‌, రాధాకృష్ణతో పాటు ఇతర పరిశీలకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా తెలుగు తమ్ముళ్లు ఎవరి అభిప్రాయాలను వారు కమిటీ సభ్యులకు తెలిపారు.

  Araku Parliament  అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుని పీఠం ఎవరికో?
సమావేశానికి హాజరైన మంత్రి, విప్‌, ఎమ్మెల్యే తదితరులు

  • హాజరైన జిల్లా తెలుగు తమ్ముళ్లు, ప్రజాప్రతినిధులు

పార్వతీపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుని పీఠం ఎవరికి వరిస్తుందన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది. విశాఖపట్నంలో సోమవారం టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎంపికపై అభిప్రాయ సేకరణ జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఇచ్ఛాపురం, ఏలూరు ఎమ్మెల్యేలు అశోక్‌, రాధాకృష్ణతో పాటు ఇతర పరిశీలకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా తెలుగు తమ్ముళ్లు ఎవరి అభిప్రాయాలను వారు కమిటీ సభ్యులకు తెలిపారు. జిల్లా నుంచి మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, జీసీసీ చైర్మన్‌, ప్రస్తుత పార్లమెంట్‌ అధ్యక్షుడు కె.శ్రావణ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. వాస్తవంగా అరకు పార్లమెంట్‌ స్థానం ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్‌ చేశారు. ఈ పార్లమెంట్‌ ఏర్పడిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. కాగా అధ్యక్షుని పీఠం ఎస్టీకి కేటాయించే అవకాశం ఉండడంతో ప్రధాన కార్యదర్శి పీఠం ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తారా ? అన్నది చర్చనీయాంశమవుతోంది. అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలు ఉన్నాయి. మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒకరు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. దీంతో అరకు పార్లమెంట్‌ అధ్యక్షుని పీఠం ఏఎస్‌ఆర్‌ జిల్లాకు కేటాయించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జనరల్‌ సెక్రటరీ పదవిని పార్వతీపురం మన్యం జిల్లాకు ఇవ్వాలని ఇక్కడి నాయకులు కోరుతున్నారు. అయితే జిల్లాలో ఈ పదవి ఏ నియోజకవర్గానికి వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుని ఎంపికలో మాత్రం నాయకులు ఏకాభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Aug 26 , 2025 | 12:11 AM