తండ్రి చూస్తుండగానే..
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:11 AM
దసరా సెలవు లు కావడంతో ఇంటి నుంచి తల్లిదండ్రులతో సరదాగా ద్విచక్ర వాహనంపై బొద్దాం వెళ్లిన ఆ చిన్నారికి అదే ఆఖరి ప్రయాణ మైంది.
రాజాం రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): దసరా సెలవు లు కావడంతో ఇంటి నుంచి తల్లిదండ్రులతో సరదాగా ద్విచక్ర వాహనంపై బొద్దాం వెళ్లిన ఆ చిన్నారికి అదే ఆఖరి ప్రయాణ మైంది. బొద్దాంలో పని ముగిం చుకుని రాజాం మీదుగా బూరాడ వెళ్లాల్సిన ఆ కుటుంబం రాజాం లో రోడ్డు ప్రమాదానికి గురైంది. తల్లిదండ్రు లిద్దరూ చిన్నగా యాలతో బయటపడగా ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు పైనుంచి వెళ్లడంతో చిన్నారి కొద్దిక్షణాల్లోనే ప్రాణాలు విడిచింది. చివరి నిమిషంలో కుమార్తెను కాపాడుకోవాలని తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన ద్రాక్షాయని (6) విషాదాం తమిది. రాజాం పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఏఎస్‌ఐ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన మోహన రావు, భార్య ఇందు, కుమార్తె ద్రాక్షాయని (6) కలిసి రాజాం మండలం బొద్దాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై మంగళ వారం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా రాజాం మెయిన్‌రోడ్‌లో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. మోహనరావు, ఇందు చిన్నపాటి గాయాలకు గురి కాగా ద్రాక్షాయని దొర్లుకుంటూ ఆర్టీసీ బస్సు వెనుక చక్రానికి తగిలి తీవ్ర గాయాలపా లైంది. ఘటనా స్థలానికి ఎదురుగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి బాలికను తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో జీఎంఆర్ నగర్‌లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ద్రాక్షాయని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రమణమూర్తి కేసు దర్యాప్త చేస్తున్నారు. ద్రాక్షాయణి రాజాంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యుకేజీ చదువుతుండేది. మోహనరావు రాజాంలో బైక్ మెకానిక్.