Share News

మొక్కు తీర్చుకుని వస్తుండగా..

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:11 AM

పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు (36) భవానీమాల ధరించి, అమ్మవారి మొక్కు తీర్చుకుని తిరిగి వస్తుండగా ఈనెల 13న రాత్రి పత్తిపాడు జంక్షన్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

మొక్కు తీర్చుకుని వస్తుండగా..

పాలకొండ, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు (36) భవానీమాల ధరించి, అమ్మవారి మొక్కు తీర్చుకుని తిరిగి వస్తుండగా ఈనెల 13న రాత్రి పత్తిపాడు జంక్షన్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. పాలకొండ నుంచి భవానీ భక్తులంతా ప్రత్యేక వాహనంలో విజయవాడకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్లిన రాంబాబు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో మృతి చెందారు. మిగిలిన భక్తులు దాన్ని గుర్తించలేదు. అక్కడ పోలీసులు గుర్తతెలియని మృతదేహంగా గుర్తించిన కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు సమాచారం రాబెట్టారు. మృతి చెందిన వ్యక్తి రాంబాబు అని గుర్తించారు. దాంతో పాలకొండ 16వ వార్డు కౌన్సిలర్‌ కడగల వెంకటరమణ సోమవారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. శవ పంచనామా తదితర ప్రక్రియలు పూర్తి ముగించుకుని మంగళవారం మృతదేహాన్ని పాలకొండ తీసుకు వచ్చారు.

Updated Date - Dec 17 , 2025 | 12:11 AM