Share News

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:04 AM

విఽధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా విధి వక్రించింది.

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..

బొబ్బిలి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): విఽధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా విధి వక్రించింది. ఇంటికెళ్లి తల్లిలేని తన కుమార్తెతో మాటా మంతీ ఆడుకుని విశ్రాంతి తీసుకుందామనుకున్న ఆ యువకుడిని మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక గ్రోత్‌ సెంటర్‌లోని బెర్రీ కంపెనీలో జేసీబీ ఆపరేటర్‌గా సత్యనారాయణ చేస్తున్నాడు. అత డు మల్లమ్మపేటలో నివాసముంటున్నాడు. రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్‌పై గ్రోత్‌ సెంటర్‌ నుంచి పట్టణానికి వస్తుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ తీవ్ర గాయాల పాలయ్యాడు. కుడి కాలు నుజ్జయిపోయింది. ఎడమ కాలు విరిగిపోయింది. తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలిస్తుం డగా మార్గమధ్యంలో సత్యనారాయణ మృతిచెందాడు. సీఐ సతీష్‌కుమా ర్‌ ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ స్వామి కేసు నమోదు చేశారు. మృతదేహానికి గురువారం బొబ్బిలి సీహెచ్‌సీలో పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. మృతిచెందిన సత్యనారాయణ మన్యం జిల్లా బలిజిపేట మండలం అరసాడ గ్రామస్థుడు. అతడి భార్య నాగమణి ఏడాదిన్నర క్రితం చనిపోయింది. తొమ్మిది సంవత్సరాల వయస్సు కలిగిన కుమార్తె జ్యోషిణి ఉంది. జేజీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి తల్లిదండ్రులు సూర్యనారాయణ, పార్వతి, అన్న వెంకటరమణ ఉన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 12:04 AM