Share News

handed over? అప్పగించేదెప్పుడు?

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:28 PM

When will it be handed over? సాలూరు, భద్రగిరి, కురుపాం, సీతంపేట ప్రాంతాల్లో పీహెచ్‌సీల నిర్మాణాలను పూర్తి చేసి.. ఈ నెలాఖరుకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టిసారించకపోవడంపై కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. రోజూ ఫొటోలతో తమకు ప్రగతి నివేదిక అందించాలని ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

  handed over?    అప్పగించేదెప్పుడు?
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • నిర్మాణాలపై రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశం

పార్వతీపురం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సాలూరు, భద్రగిరి, కురుపాం, సీతంపేట ప్రాంతాల్లో పీహెచ్‌సీల నిర్మాణాలను పూర్తి చేసి.. ఈ నెలాఖరుకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టిసారించకపోవడంపై కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. రోజూ ఫొటోలతో తమకు ప్రగతి నివేదిక అందించాలని ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పడకలు, సిబ్బంది, మౌలిక వసతు లకు ఇబ్బందులు లేకుండా చూడాలని గతంలోనే ఆదేశించినా.. ఇప్పటివరకు వాటిపై ఎందుకు శ్రద్ధ వహించలేదని ప్రశ్నించారు. అత్యవసరమైన పనులు చేపట్టేందుకు సీఎస్‌ఆర్‌ కింద ప్రతి పాదనలు పంపితే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఆసుపత్రికి త్రీఫేజ్‌ కరెంట్‌, జనరేటర్‌ బ్యాకప్‌, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు, ప్రహరీ, రహదారి, ఇతర మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. నీటి కుంటలను, రహదారులు, ప్రహరీలను ఉపాధి హామీ కింద చేపట్టాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కర రావు, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

గ్రౌండింగ్‌ చేయండి

జిల్లాలో పరిపాలనా ఆమోదం పొందని పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాకు 80 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా 68కి పరిపాలనా ఆమోదం మంజూరు చేశామన్నారు. మిగిలిన వాటికి ఉత్తర్వులు పొందలేకపోవడంపై ఆరా తీశారు. వాటితో పాటు కొత్తగా సీతంపేటలో నాలుగు, పార్వతీపురం, సాలూరులో రెండు భవ నాలు మంజూరైనట్లు వెల్లడించారు. ఒక్కో భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు, ఉపాధి హామీ కంపోనెంట్‌ కింద రూ.7 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 12 మండలాల నుంచి 60 మంది బ్లాక్‌ స్థాయి కర్మయోగులను ఎంపిక చేశామన్నారు. వీరందరికీ ఈ నెల 28, 29, సెప్టెంబరు 2, 3 తేదీల్లో సూచించిన మండలాల్లో శిక్షణ ఇచ్చేందుకు తగిన వేదికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఐటీడీఏ ఏపీవో ఏ.మురళీకృష్ణ, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 11:28 PM