Share News

When They Unite... It's a Feast of Riches కలిసొస్తే.. సిరుల పంటే!

ABN , Publish Date - May 18 , 2025 | 11:28 PM

When They Unite... It's a Feast of Riches జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెద్దఎత్తున కొబ్బరి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాటి సంరక్షణను గ్రామైక్య మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే మొక్కలు నాటే ప్రాంతాలను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఇతర అధికారులు పరిశీలించారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నారు.

When They Unite... It's a Feast of Riches కలిసొస్తే.. సిరుల పంటే!
పార్వతీపురం మండలం ఎల్‌ఎన్‌పురంలో కొబ్బరి మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, డ్వామా పీడీ (ఫైల్‌)

‘మన్యం’లో ప్రతిష్ఠాత్మకంగా అమలు

సంరక్షణ బాధ్యతలతో గ్రామైక్య మహిళా సంఘాలకు ప్రత్యేక ఉపాధి

పార్వతీపురం, మే 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెద్దఎత్తున కొబ్బరి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాటి సంరక్షణను గ్రామైక్య మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే మొక్కలు నాటే ప్రాంతాలను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఇతర అధికారులు పరిశీలించారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నారు. జిల్లాలో తోటపల్లి, వీఆర్‌ఎస్‌, జంఝావతి ప్రాజెక్టు ప్రాంతాలతో పాటు ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌, నది పరివాహక ప్రాంతాల్లో కొబ్బరి మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఎకరాకు 60 మొక్కల చొప్పున సుమారు 2,670 ఎకరాల్లో వాటిని నాటనున్నారు. ఆయా మొక్కల సంరక్షణ బాధ్యతలను చూసే విలేజ్‌ ఆర్గనైజింగ్‌ మహిళా సంఘాలకు ప్రతినెలా 300 మొక్కలకు రూ.10 వేల చొప్పున నగదును జమ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 600 మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కలగనుంది. మొక్కలు పెద్దవైన తర్వాత వాటి నుంచి వచ్చే ఫలాలను పంచా యతీలకు లేదా మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.

త్వరలోనే ప్రారంభిస్తాం

కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాజెక్టుల వద్ద , చెరువుల గట్లుపైన త్వరలో కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మొక్కలను సంరక్షించే వారికి శాశ్వత ఉపాధి లభించనుంది. ఉపాధి హామీ పథకం ద్వారా తొలిసారిగా ‘మన్యం’లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.

- రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం

Updated Date - May 18 , 2025 | 11:28 PM