When It Rains వాన కురిసే.. మది మురిసే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:18 PM
When It Rains, Hearts Rejoice వరుణుడు కరుణించాడు.. ఎట్టకేలకు జిల్లాలో వర్షం కురిసింది. పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వాన కోసం ఎదురుచూసిన వారికి ఊరట లభించింది.
పంట పొలాల్లోకి నీరు
రైతుల్లో ఆనందం
పార్వతీపురం/గరుగుబిల్లి, జూలై19(ఆంధ్రజ్యోతి): వరుణుడు కరుణించాడు.. ఎట్టకేలకు జిల్లాలో వర్షం కురిసింది. పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వాన కోసం ఎదురుచూసిన వారికి ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక వరి ఎదలు, నారుమళ్లు ఎండిపోయిన విషయం తెలిసిందే. వాటిని బతికించేందుకు ఇంజన్ల సాయంతో రైతులు నీటిని మళ్లించారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షం నారుమడులకు జీవం పోసింది. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల దమ్ములు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉబాలకు సన్నద్ధమవుతున్నారు. మరో 15 రోజుల వరకు వర్షం కురిస్తే.. ఖరీఫ్ పంటలకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు.