Share News

నిధులు ఖర్చు చేయని పాలకవర్గాన్ని ఏమనాలి?

ABN , Publish Date - May 16 , 2025 | 12:25 AM

మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.2 కోట్లు నిధులు తెస్తే, ఖర్చు చేయని పాలకవర్గాన్ని ఏమనాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

నిధులు ఖర్చు చేయని పాలకవర్గాన్ని ఏమనాలి?
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • మంత్రి సంధ్యారాణి

సాలూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు రూ.2 కోట్లు నిధులు తెస్తే ఖర్చు చేయ ని పాలకవర్గాన్ని ఏమనాలని, పట్టణ ప్రజలు నడి రోడ్డుపై నిలబెట్టి ప్రశ్నించే రోజు తప్పకుండా వస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం సాలూరులోని తన నివాసంలో ఆమె స్థానిక విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిపాలనలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 5 సంవ త్సరాలుగా రోడ్లు గుంటలుగానే మిగిలిపో యాయ న్నారు. గత ప్రభుత్వం కాలంలో మున్సిపాలిటీ సమర్దవంతంగా పనిచేయకపోవడంతో శ్యామలాంబ పండగ కూడా నిర్వహించలేదన్నారు. శానిటైజేషన్‌ కోసం సరైన సామగ్రిని కూడా మున్సిపాలిటీకి అం దించలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక వర్గం ఆమోదం తెలపకపోతే కలెక్టర్‌ నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేస్తామని తెలిపారు. ప్రజలకు రెండు పూటలా తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. రెండు వార్డులకు ఒక మున్సిపల్‌ ట్యాంకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పట్టణంలో సీసీ కెమెరాలను తన సొంత డబ్బులతో తెప్పించి ఏర్పాటు చేయనున్న ట్టు తెలిపారు. ఈ ఆదివారం అమ్మవారి ఉయ్యాల కంబాల కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ఆడిం చుకుందామని పిలుపునిచ్చారు. అలాగే సోమవారం అమ్మవారిని గద్దె దగ్గర ఉంచి అక్యానవీధి, అల్లువీధి, యాదవుల వీధి, డబ్బివీధి, మెంటాడ వీధుల నుంచి తోలెళ్ల ఉత్సవం నిర్వహిస్తారని తెలిపారు. మంగళ వారం సిరిమానోత్సవం అద్భుతంగా నిర్వహించను న్నట్టు తెలిపారు. పండగను నేపథ్యంలో ప్రజలు చెత్త కవర్లను మున్సిపాలిటీ వాహనంలోనే వేయాలని, రోడ్లు, మున్సిపాలిటీ కాలువలను శుభ్రంగా ఉంచాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. పండగ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు(చిట్టీ), హర్షవర్ధన్‌, బృందావన అశోక్‌, పప్పల మోహనరావు, కూనిశెట్టి భీమారారావు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:27 AM