No Doctors in the PHC? పీహెచ్‌సీలో వైద్యులు లేకుంటే ఎలా?
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:57 PM
What if There Are No Doctors in the PHC? కొమరాడ పీహెచ్‌సీలో వైద్యులు లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యాధికారులు కూడా లేకపోవడంతో ఓపీ ఎవరు చూస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు.
కొమరాడ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కొమరాడ పీహెచ్‌సీలో వైద్యులు లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యాధికారులు కూడా లేకపోవడంతో ఓపీ ఎవరు చూస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ఒకరు మెడికల్ క్యాంపునకు, మరొకరు ట్రైనింగ్‌కు వెళ్లినట్లు వారు తెలిపారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. రోగులకు ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కొమరాడ తహసీల్దార్ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.