Share News

What happened to that Rs. 2 lakh? ఆ రూ.2 లక్షలు ఏమయ్యాయి?

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:31 PM

What happened to that Rs. 2 lakh? వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పనుల్లో జరిగిన అవకతవకల్లో రూ.2 లక్షలు లెక్కల్లో లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాఽధికారి మాణిక్యంనాయుడు డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం విచారించారు. హెచ్‌ఎం, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. సమస్య తేలకపోవడంతో విచారణ వాయిదా వేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

What happened to that Rs. 2 lakh? ఆ రూ.2 లక్షలు ఏమయ్యాయి?
పాఠశాలలో దర్యాప్తు చేస్తున్న డీఈవో మాణిక్యంనాయుడు

ఆ రూ.2 లక్షలు ఏమయ్యాయి?

- విచారించిన డీఈవో మాణిక్యంనాయుడు

- నాడు - నేడు నిధుల వినియోగంలో అవకతవకలు

రాజాం రూరల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పనుల్లో జరిగిన అవకతవకల్లో రూ.2 లక్షలు లెక్కల్లో లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాఽధికారి మాణిక్యంనాయుడు డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం విచారించారు. హెచ్‌ఎం, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. సమస్య తేలకపోవడంతో విచారణ వాయిదా వేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో రూ.5.20 లక్షలు మంజూ రయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పాలవలస బాబూరావు కొంతమేర పనులు పూర్తిచేశారు. 2019లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనుల్ని పరస్పర అంగీకారంతో పాలవలస గోపి పూర్తిచేసేందుకు ముందుకొచ్చారు. అయితే అప్పటికే పాత కాంట్రాక్టర్‌కు తొలివిడతగా రూ.2 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తాన్ని ఇంజినీరింగ్‌ విభాగం అంగీకారంతో కాంట్రాక్టర్‌ విత్‌డ్రా చేసుకున్నారు. ఇదే పనులకు సంబంధించి రెండోవిడతగా 2020 ఏప్రిల్‌లో రూ.2 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. కొద్దివారాల తేడాలో రెండోవిడతగా విడుదలైన రూ.2 లక్షల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వెనక్కి మళ్లిన మొత్తం 2020 అక్టోబరులో ప్రభుత్వం తిరిగి విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా అప్పటివరకూ పాఠశాల హెచ్‌ఎంగా ఉన్న వీవీ వసంత కుమార్‌ మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్‌ తనకు రూ.3.20 లక్షలు రాకపోవడంతో ఇంజినీరింగ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

రికార్డుల ప్రకారం..

ఈ పనులకు సంబంధించి ఇంజినీరింగ్‌ అధికారులు రికార్డులు పరిశీలించారు. కాంట్రాక్టర్‌కు రూ.4 లక్షలు విడుదలైనట్లు, సెస్‌ పోను రూ.88 వేలు మాత్రమే బకాయి ఉందని నిర్ధారించారు. దీంతో ఏకీభ వించని కాంట్రాక్టర్‌ హెచ్‌ఎంను ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో మాణిక్యంనాయుడు డోలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం దర్యాప్తు నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 లక్షలు తిరిగి మళ్లిపోయాయని హెచ్‌ఎం వసంతకుమార్‌ స్పష్టం చేయగా, అందుకు సంబంధించిన ఆధారాలు చూపాలని డీఈవో ఆదేశించారు. రెండోసారి విడుదలైన రూ.2 లక్షలు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా అక్టోబరులో తిరిగి విడుదల చేసిన అంశాన్ని ఆధారాలతో సహా కాంట్రాక్టర్‌, డీఈవో చూపించగా హెచ్‌ఎం స్పష్టత ఇవ్వలేకపోయారు. తనకేమీ తెలియదని చెప్పడంతో కార్యాలయానికి రావాలని డీఈవో ఆదేశించినట్లు తెలిసింది.

Updated Date - Oct 15 , 2025 | 11:31 PM