‘Aadi Karmyogi Abhiyan’! ‘ ఆది కర్మయోగి అభియాన్’ అమలులో మనమే ఫస్ట్!
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:05 AM
We’re the First to Implement the ‘Aadi Karmyogi Abhiyan’! ‘ఆది కర్మయోగి అభియాన్’ అమలులో రాష్ట్రంతో పాటు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ధాత్రి జన్ భగీరథి ద్వారా గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలకు గాను పార్వతీపురం ఐటీడీఏకు కూడా మొదటి స్థానం లభించింది.
పార్వతీపురం, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): ‘ఆది కర్మయోగి అభియాన్’ అమలులో రాష్ట్రంతో పాటు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ధాత్రి జన్ భగీరథి ద్వారా గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలకు గాను పార్వతీపురం ఐటీడీఏకు కూడా మొదటి స్థానం లభించింది. ఆది కర్మయోగి అభియాన్’కు సంబంధించి ఈ నెల 17న న్యూఢిల్లీలో ఏపీ తరఫున గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. శిక్షణ అందించిన ఏపీవో మురళీధర్‌కు ఉత్తమ మాస్టర్ ట్రైనీగా అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదాభార్గవి తదితరులు పాల్గొన్నారు. ‘ ఆదికర్మయోగి అభియాన్ అమలులో జిల్లాకు ప్రథమ స్థానం రావడం.. పార్వతీపురం ఐటీడీఏకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో అనంతరంగా ఉంది. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరేవర్చే విధంగా కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు అని మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.