గడ్డి కోతకు వెళ్లి.. విగత జీవిగా మారి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:57 PM
మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన గిరిజనుడు పత్తిక జగన్నాథం(44) మంగళవారం గడ్డికోతకు వెళ్లి విగత జీవిగా మారాడు.
భామిని, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన గిరిజనుడు పత్తిక జగన్నాథం(44) మంగళవారం గడ్డికోతకు వెళ్లి విగత జీవిగా మారాడు. బత్తిలి పోలీసుల కథనం మేరకు.. జగన్నాథం పొలం బట్టి వద్దకు మంగళవారం గడ్డికోతకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత స్థానికులు జగన్నాథం మృతదేహాన్ని బట్టి వద్ద గుర్తించారు. అనంతరం సమాచారం తెలు సుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నీటిలో మునిగి గాని, ఏ విష పురుగు కాటువేసి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు జగన్నాథం భార్య వనజాక్షి నుంచి స్టేట్‌మెంట్ తీసుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి శవ పంచనామాకు తరలించారు. కాగా జగన్నాథం కుటుంబ సభ్యులకు సంబంధించి మంగళవారం రాత్రి నూతన గృహప్రవేశం నిర్వహించనున్నారు. ఇంతలో జగన్నాథం మృతిచెందడంతో బంధువులు, గ్రామస్థులు విషాధంలో మునిగిపోయారు.