Share News

ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:54 PM

మండలం లోని కోన గ్రామానికి చెందిన మడక గోవర్ధనరావు(28) కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్‌ జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నా డు.

ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి
గోవర్ధనరావు(ఫైల్‌)

మక్కువ రూరల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మండలం లోని కోన గ్రామానికి చెందిన మడక గోవర్ధనరావు(28) కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్‌ జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నా డు. గోవర్ధనరావు తల్లిదండ్రులు మడక రామకృష్ణ, చిన్నమ్మ లకు గురువారం ఆ సమాచారం చేరింది. ఇందుకు సంబం ధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోన, దబ్బగెడ్డ, గోపాలపు రం గ్రామాలకు చెందిన ఆరుగురు యువకులు ఏడాది కిందట ఉపాధి కోసం కేరళ వెళ్లారు. అక్కడ కాసరగోడ్‌ జిల్లా కేంద్రంలో విశిద కంపెనీ లో పనిచేస్తున్నారు. వారిలో దబ్బగెడ్డకు చందిన యువకునితో కలిసి ఒక గదిలో గోవర్ధనరావు ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి దబ్బగెడ్డ గ్రామానికి చెందిన యువకుడు తన స్వగ్రామానికి వచ్చాడు. గురువారం ఉద యం సుమారు 10 గంటల సమయంలో వేరే గదిలో ఉంటున్న కోన గ్రామానికి చెందిన మరో యువకుడు.. గోవర్ధనరావు కోసం అతడి గదికి వెళ్లి చూశాడు. గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని గోవర్ధనరావు మృతి ఉండటాన్ని గుర్తించి.. తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. దాంతో కుటుంబ కన్నీరుమున్నీ రయ్యారు. విషయం తెలుసుకున్న గోవర్ధనరావు అన్నయ్య కేరళ వెళ్లారు. గోవర్ధనరావు మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Updated Date - Jul 24 , 2025 | 11:54 PM