Share News

Well done.. Yasaswini! శభాష్‌.. యశస్విని!

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:48 PM

Well done.. Yasaswini! కొమరాడ మండల కేంద్రానికి చెందిన నీరస యశస్విని నీట్‌లో మెరిసింది. ఆలిండియా కేటగిరీలో 646వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 176వ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకుంది.

Well done.. Yasaswini! శభాష్‌.. యశస్విని!
యశస్వినికి స్వీట్‌ తినిపిస్తున్న తండ్రి

జియ్యమ్మవలస, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండల కేంద్రానికి చెందిన నీరస యశస్విని నీట్‌లో మెరిసింది. ఆలిండియా కేటగిరీలో 646వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 176వ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఆ విద్యార్థిని ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు పార్వతీపురంలో, కృష్ణా జిల్లాలో 8, 9, 10 తరగతులు చదివింది. విజయవాడలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. యశస్విని తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం మండలం ఎమ్మార్‌ నగరం హైస్కూల్‌లో ఫిజిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా, తల్లి పార్వతి జియ్యమ్మవలస మండలం పెదమేరంగి ఎంపీ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. తమ కుమార్తె నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:48 PM