Share News

సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:49 PM

గ్రామాల్లో కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అంగన్‌ వాడీలు కోరారు. పలు సమస్యలు పరిష్కరించాలని గురువారం అంగన్‌వా డీ కార్యకర్తలు నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
వీరఘట్టం: తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కార్యకర్తలు:

గ్రామాల్లో కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అంగన్‌ వాడీలు కోరారు. పలు సమస్యలు పరిష్కరించాలని గురువారం అంగన్‌వా డీ కార్యకర్తలు నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

ఫగరుగుబిల్లి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):వేతనాలు పెంచడంతో పాటు ట్యాబ్‌లు అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తల ప్రతినిధులు గౌరమ్మ, సావిత్రి, పి.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు. గరుగుబిల్లిలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ బాలకు వినతిపత్రం అందజేశారు.

ఫవీరఘట్టం, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి):పనికి తగ్గవేతనం అందజేయా లని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కోరారు. మొబైల్‌ యాప్‌లు, బయోమెట్రిక్‌ విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గురువారం వీరఘట్టం తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో అంగన్‌వాడీ సిబ్బంది తహసీల్దార్‌ సాయి కామేశ్వరరావుకు వినతిపత్రం అందించారు.

ఫసీతానగరం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ నాయకులు గంట జ్యోతి, వెన్నెల రామలక్ష్మిలు డిమాండ్‌ చేశారు.ఈమేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర సన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచడం తో పాటు ఎఫ్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిం చాలని కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని డీటీ ఉమామహే శ్వరరావుకు వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో ఎం.సత్యవతి, ఎం.సునీత, పి.పద్మ, శారద పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:49 PM