Share News

Welfare పేదల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:16 AM

Welfare of the Poor Is the Goal పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు మండలం కూర్మరాజుపేటలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు.

Welfare  పేదల సంక్షేమమే లక్ష్యం
కూర్మరాజుపేట గ్రామంలో వృద్ధురాలితో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు మండలం కూర్మరాజుపేటలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం పింఛన్‌ సొమ్ము అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. అర్హులకు పింఛన్‌ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పరమేష్‌, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి..

గరుగుబిల్లి: ఉల్లిభద్రలో బుధవారం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందించారు. పింఛన్లు పంపిణీ అనేది సంక్షేమమే ఒక్కటే కాదని, ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక బాధ్యతని తెలిపారు. జిల్లాలో 1,40,066 మంది పింఛన్‌దారులకు ప్రతి నెలా రూ. 60 కోట్లకు పైబడి అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మంచంపై ఉన్న దీర్ఘకాలిక పింఛన్‌దారునికి నగదు అందించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిర్దేశించిన సమయంలోగా పింఛన్లు అందిం చాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. నేరుగా ఇంటి వద్దకే వెళ్లి సొమ్ము అందజేయాలని , నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, ఎంపీడీవో జి.పైడితల్లి తదితరులు ఉన్నారు. కాగా జిల్లాలో తొలిరోజు పింఛన్లు పంపిణీ 91 శాతం మేర జరిగింది. 1,25,426 మందికి రూ. 53.21 కోట్లు అందించారు.

Updated Date - Oct 02 , 2025 | 12:16 AM