Share News

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 06 , 2025 | 11:53 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం పట్టణంలో ఇటీవల 6,16,18 వార్డులలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అం దజేశారు.

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పింఛన్‌ అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి:

సాలూరు, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం పట్టణంలో ఇటీవల 6,16,18 వార్డులలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అం దజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్‌ భరోసా పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుపేదలకు భద్రత కల్పిస్తున్నా రన్నారు. అర్హులైన ప్రతిలబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందించడమే ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ నూతి రాజేశ్వరి, శ్రీని వాసరావు పాల్గొన్నారు.

కోనపోలమ్మ అమ్మవారికి పూజలు

మక్కువ, మే 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోన పంచాయతీ పరిధి గోపాలపురంలో గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా కోన పోలమ్మ అమ్మవారిని రాష్ట్ర స్ర్తీ, శిశు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మం గళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల నాయుడు, బొత్స కన్నంనాయుడు, డాక్టర్‌ పి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:53 PM