Weightlifter dies in road accident రోడ్డు ప్రమాదంలో వెయిట్‌లిఫ్టర్ దుర్మరణం
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:04 AM
Weightlifter dies in road accident కొండవెలగాడలో జరుగు తున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి విజయ నగరం నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రీడాకారిణి సత్యజ్యోతి(26) రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందారు. విజయనగరం దాటాక ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. 25 రోజుల క్రితం తండ్రి మృతి చెందాడు. ఆ బాధ నుంచి తేరుకోకముందే ఈమె మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వెయిట్‌లిఫ్టర్ దుర్మరణం
పోటీలకు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఘటన
25 రోజుల క్రితం తండ్రి మృతి
విషాదంలో సత్యజ్యోతి కుటుంబం, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు
విజయనగరం క్రైం/నెల్లిమర్ల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కొండవెలగాడలో జరుగు తున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి విజయ నగరం నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రీడాకారిణి సత్యజ్యోతి(26) రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందారు. విజయనగరం దాటాక ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. 25 రోజుల క్రితం తండ్రి మృతి చెందాడు. ఆ బాధ నుంచి తేరుకోకముందే ఈమె మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.
విజయనగరంలోని బాబామెట్ట ఏడు కోవిళ్ల సమీపంలో ఉంటున్న తాడితూరి భాస్కరరావు, యశోద దంపతుల కుమార్తె తాడితూరి సత్యజ్యోతి (26) వాల్తేరు డివిజన్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి భాస్కరరావు కలెక్టరేట్ ప్లానింగ్ సెక్షన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 25 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి యశోద రెండేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సత్యజ్యోతి నాలుగో సంతానం. పెద్దకుమార్తె సంధ్యాదేవి వీఆర్వోగా పనిచేస్తోంది. రెండో కుమార్తె సరోజగాయత్రి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. సోదరుడు సతీష్‌బాబు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా ఉన్నాడు. సత్యజ్యోతి శనివారం కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా పోటీలను తిలకించేందుకు అక్క సరోజగాయత్రితో విజయనగరం నుంచి టూవీలర్‌పై బయలుదేరింది. విజయనగరం దాటాక ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. సత్యజ్యోతి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఫ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించి మేటి క్రీడాకారిణిగా ప్రశంసలు అందుకున్న సత్యజ్యోతి అకాల మరణాన్ని క్రీడాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త జిల్లా క్రీడాకారుల్లో పెను విషాదం నింపింది. సత్యజ్యోతి ఆదివారం ఉదయం జరుగనున్న పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. ఆమె మృతితో పోటీలు జరుగుతున్న ప్రాంతంలో విషాదం అలముకుంది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడా ప్రతిభతోనే రైల్వేలో సత్యజ్యోతి ఉద్యోగం సాధించింది.