Weekly Medical Checkups విద్యార్థులకు ప్రతివారం వైద్య పరీక్షలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:26 AM
Weekly Medical Checkups for Students ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై ప్రతీ వారం వైద్యపరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. గురువారం ఎర్రసామంతవలస ఆశ్రమపాఠశాలను సందర్శించారు.
మక్కువ రూరల్, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై ప్రతీ వారం వైద్యపరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. గురువారం ఎర్రసామంతవలస ఆశ్రమపాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంట గదులు, ఆర్వో ప్లాంటు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాలపై ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఇళ్లకు పంపించరాదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లి తగిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆయన వెంట డీపీఎంవో రఘు, ప్రోగ్రామ్ అధికారి కౌశిక్ తదితరులున్నారు.