Share News

Farmers రైతులను ఇబ్బంది పెడితే సహించబోం

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:40 PM

We Won’t Tolerate Harassment of Farmers ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, అధికారులతో ఆయన మాట్లాడారు.

  Farmers రైతులను ఇబ్బంది పెడితే సహించబోం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • అధికారులను ఆదేశించిన కలెక్టర్‌

పార్వతీపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో కొంతమంది మిల్లర్లు నిబంధనలు పాటించడం లేదు. అటువంటి వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టండి. రైతులను గౌరవించని వారిని క్షమించేది లేదు. అవకతవకలకు పాల్పడిన కొన్ని మిల్లులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. ఇప్పటికీ కొంతమంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం. ప్రతి రైస్‌మిల్లు, రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిబంధనలు, తదితర వివరాలతో కూడిన వాల్‌ పోస్టర్లను ఉంచాలి. గన్ని బ్యాగ్‌లు ఇచ్చిన వాటికి సంబంధించి రైతు ఖాతాలో ఆ డబ్బులు జమ అవుతాయన్న విషయాన్ని తెలిజేయాలి. వ్యవసాయాధికారులు, సివిల్‌ సప్లైస్‌, ధాన్యం కొనుగోలు సిబ్బందితో కలిసి గ్రామాల్లోకి వెళ్లాలి. ధాన్యం కొనుగోలుపై అవగాహనా సమావేశాలు నిర్వహించాలి. రైతులకు ఇచ్చే బిల్లుల విషయంలో స్పష్టత పాటించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో సివిల్‌ సప్లైస్‌ డీఎం శ్రీనివాస్‌, డీఎస్‌వో బాలసరస్వతి, వ్యవసాయశాఖాధికారి అన్నపూర్ణ, జిల్లా రైస్‌మిల్లర్లు సంఘం అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:40 PM