మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:24 PM
: బంగ్లాదేశ్ బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ద్వారా ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
భోగాపురం, డిసెంబరు8(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్ బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ద్వారా ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. సోమవారం కొండ్రాజుపాలెంలో హేచరీస్ నిర్వాహకుల ఆర్థిక సహాయంతో బంగ్లాదేశ్ బాదిత తొమ్మిది మత్స్యకార కుటుంబాలకు ఒక్కక్కరికి రూ.10 వేలు, 25 కేజీల బియ్యం చొప్పున అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులతో నేరుగా మాట్లాడడం కుదరడంలేదని, అక్కడ జైలర్‌తో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నామని, అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు.బందీలుగా ఉన్న మత్స్యకారులు రావడానికి ఆరు నెలల సమయం పట్టె అవకాశముందని, వారువచ్చే వరకూ వారి కుటుంబాలను ప్రభుత్వం ద్వారా ఆదు కొనేలా ప్రయత్నాలుచేస్తామని తెలిపారు.అనంతరం కొంగవానిపాలెం సమీపంలో ఎయి ర్‌పోర్టుకు సంబందించి నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్,రాంబాబు, సూరాడ చిన్నారావు, మట్టా అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు.