Share News

విచారణ నివేదిక కలెక్టర్‌కు అందజేస్తాం

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:24 AM

కొమరాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులు మేరకు రికార్డులను పరిశీలించి నివేది కను కలెక్టర్‌కు అందజేస్తామని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు తెలిపారు.గురువారం కొమరాడ సచివాలయంలో ఫిర్యాదుదారులు, సర్పంచ్‌ సమక్షంలో నిధులు వినియోగంపై విచారణ నిరహించారు. గ్రామానికి చెందిన కశినబోయిన చంటి, రమేష్‌ ఇటీవల కొమరాడ పంచాయతీకి చెం దిన 35లక్షలరూపాయలు వరకు నిధులు దుర్వినియోగమయ్యాయని కలె క్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారు.

 విచారణ నివేదిక కలెక్టర్‌కు అందజేస్తాం
విచారణ నిర్వహిస్తున్న అధికారులు

కొమరాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కొమరాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులు మేరకు రికార్డులను పరిశీలించి నివేది కను కలెక్టర్‌కు అందజేస్తామని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు తెలిపారు.గురువారం కొమరాడ సచివాలయంలో ఫిర్యాదుదారులు, సర్పంచ్‌ సమక్షంలో నిధులు వినియోగంపై విచారణ నిరహించారు. గ్రామానికి చెందిన కశినబోయిన చంటి, రమేష్‌ ఇటీవల కొమరాడ పంచాయతీకి చెం దిన 35లక్షలరూపాయలు వరకు నిధులు దుర్వినియోగమయ్యాయని కలె క్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారు.ఈ మేరకు పంచాయతీలో నాలుగు సంవత్స రాలుగా జరిగిన అభివృద్ధి నిధులు ఖర్చు వివరాలపై విచారణ చేస్తున్నట్లు కొండలరావు తెలిపారు.పారిశుధ్యనిర్వహణతోపాటు డ్రైనేజీ, శానిటేషన్‌, కుక్క లు తరలించడం కోసం, వీధిమలుపులు వద్ద చెత్త తరలింపు తదితర అం శాలపై నిధులు ఖర్చుచేసి దుర్వినియోగం చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు వివరాలు, రికార్డులను పరిశీలించారు. అధికంగా ఇంటి పన్నుల వసూళ్లలో నిధులు దుర్వినియోగమయ్యాయని, ప్రభుత్వానికి నగదు చెల్లించకుండా కార్యదర్శి, సర్పంచ్‌ వాడుకున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. కార్యక్రమంలో విస్తరణాధికారి రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:24 AM