Share News

పరిశుభ్రత లేకపోతే నిధులు నిలిపివేస్తాం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:14 AM

పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టని పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నిలిపివేస్తామని మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావుహెచ్చరించారు.

  పరిశుభ్రత లేకపోతే నిధులు నిలిపివేస్తాం
మక్కువలో పారిశుధ్యపనులను పరిశీలిస్తున్న కొండలరావు :

మక్కువ రూరల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి):పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టని పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నిలిపివేస్తామని మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావుహెచ్చరించారు. గురువారం మక్కువలో జరు గుతున్న పారిశుధ్యకార్యక్రమాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ మండలంలోని అన్ని పంచాయతీల్లో విధిగా పారిశుధ్యకార్యక్రమాలు చేపట్టి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలాచర్యలు తీసుకోవాలని, పనులు చేపట్టని పంచాయ తీలకు ప్రభుత్వంనుంచి విడుదలయ్యే నిధులను నిలిపివేయాలని ఎంపీడీవో అర్జున రావు, డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణలను ఆదేశించారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలుచేసేలా కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది చర్యలుతీసుకో వాలని కోరారు. వ్యాపారులు షాపులవద్ద చెత్తను బయటపారవేయకుండా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఎంపీడీవోకార్యాలయంలో అధికారులతో సమా వేశమై పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిపనులపై సమీక్షించారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్‌.అర్జునరావు, మక్కువ గ్రామకార్యదర్శి బి.శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:14 AM