తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:18 AM
మొంథా తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. గురువారం జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పలు చోట్ల బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీచేశారు.
మొంథా తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. గురువారం జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పలు చోట్ల బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీచేశారు.
అన్నివిధాలా సహకరిస్తాం
సాలూరు,అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి):తుఫాన్‌వల్ల నష్టపోయిన కుటుం బాలకు అన్నివిధాలా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుం టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మునిసిపల్ కార్యాలయంలోగల పునరావాస కేంద్రంలో ఉన్న కుటుంబాలకు నిత్యా వసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాలడుతూ జిల్లాలో 159 కుటుంబాలకు, సాలూరు నియోజకవర్గంలో 79 కుటుం బాలకు సహాయం అందజేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు అందజేశారు.
ఫపాచిపెంట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ వల్ల తడిసిన వరి, మొక్కజొన్న, తదితర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.పాచిపెంట తహసీల్దార్ కార్యాల యంలో అధికారులతో సమీక్షించారు. నిబంధనల మేరకు పంటల నష్ట పరిహారం అంచనా వేయాలని ఏవోకు సూచించారు. తుఫాన్ ప్రభావం వల్ల కలిగే నష్టాలను, సహాయక చర్యల గురించి తహసీల్దార్ డి.రవిని అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో బీవీజే పాత్రోకు ఆదేశించారు. పాఠశాలలు నిర్వ హణ పునరుద్ధరించినా పిల్లలురావాలని బలవంతం చేయవద్దని ఎంఈవో సతీష్‌కు తెలిపారు. అవసరమైతే ఆప్సన్ హాలిడే ఇవ్వాలని ఆదేశించారు. కాగా పెద్దగెడ్డ ప్రాజెక్టును సంధ్యారాణి పరిశీలించారు. ఆమె వెంట ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్య నారాయణ, గూడేపు యుగం ధర్, ఉమామహేశ్వరరావు, నాయకులు చల్లా కనకబాబు, నరసింగరా వు ఉన్నారు.
రైతులను ఆదుకుంటాం
జియ్యమ్మవలస, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాను బాధితులు, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. మండలంలోని డంగభద్ర, గడసింగుపురం పంచాయతీల్లో ఆమె అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, మండల కన్వీనర్ జోగి భుజంగరావులతో కలిసి పర్యటించారు. అనంతరం గడసింగుపురం, డంగభద్ర మధ్య ఒమ్మిగెడ్డను పరిశీలించారు. ఇక్కడ కాజ్‌వే నిర్మాణంపై ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తరువాత డంగభద్రవ లసలోని పునరావాస కేంద్రంలో నిత్యావసర సరుకులతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.మూడు వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వై.జయలక్ష్మి, ఎస్.ధ్రువ, స్రవంతి, విహారి పాల్గొన్నారు.
ఫగుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):తుఫాన్ బాధితులకు ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్లు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీనిచ్చారు. టంకు గ్రామంలో ఇళ్లు కోల్పోయినప గిరిజన కుటుంబానికి పరామర్శించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులను అందించారు.
ఫకురుపాం రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొండెంఖల్ పంచాయతీ గోర్జిపాడులో బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు విప్ జగదీశ్వరి అందజేశారు. ఆమె వెంట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంజిత్‌కుమార్ నాయకో, బలరాం, నరేష్ ఉన్నారు.
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి హామీ
సీతానగరం (బలిజిపేట), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలంలోని నూకలవాడ, వంతరాంలో వరద ప్రభావిత ప్రాం తాలను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా నూకలవాడలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ అజ్జాడ, బలిజిపేట సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకువచ్చామన్నారు. నూకలవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, రూ. వెయ్యి చొప్పున అందజేశారు. అనంతరం వంతరాంలోని లోతట్టు ప్రాంతాన్ని సందర్శించి వేగావతి నది నీరు గ్రామంలోకి రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్ బాలమురళీకృష్ణ, ఎంపీడీవో వాణిశ్రీ, పి.వేణుగోపాల్‌నాయుడు పాల్గొన్నారు.